skip to Main Content
ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం తెలుసుకోవాల్సిన కీలక విషయాలు...... ✍ అంత్యక్రియలకు సాయం ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల ఖర్చుకుగాను తక్షణం రూ.20 వేలు అందిస్తారు. G.O.Ms.No.122, GA(SW) Department, Dt: 11.04.2016 ఈ జీవోలో అన్ని వివరాలు పొందుపరిచారు. ✍ మరణించిన ఉద్యోగి :: మృతదేహాన్ని తరలించడానికి సంబంధించి రవాణా చార్జీలు సైతం ప్రభుత్వ చెల్లిస్తుంది. ఎక్కడైతే మరణిస్తారో అక్కడి నుంచి తరలించే ప్రాంతాన్ని బట్టి ఈ చార్జీలు చెల్లిస్తారు. దీనికి సంబంధించి 1987 జూన్‌ 23న జీవో 153 జారీచేశారు. ✍ ఎన్‌క్యాష్‌మెంట్‌ :: మృతిచెందిన ఉద్యోగి ఎర్న్‌డ్‌ లీవ్‌లకు సంబంధించిన ఎన్‌క్యాష్‌మెంట్‌ను కుటుంబసభ్యులకు చెల్లిస్తారు. ఈ ఎన్‌క్యాష్‌మెంట్‌ను 240 రోజుల నుంచి 300 రోజులకు పెంపుదల చేశారు. దీనికి సంబంధించి 2005 సెప్టెంబర్‌ 16న జీవో 232 జారీచేశారు. ✍ యాక్సిడెంటల్‌ ఎక్స్‌గ్రేషియా :: విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు ప్రమాదాల్లో మృత్యువాత పడితే ప్రభుత్వం రూ.లక్ష ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తుంది. దీనికి సంబంధించి 2006 జూలై 7న 317 జీవో జారీచేశారు. ✍ రవాణా చార్జీలు :: ఉద్యోగి విధి నిర్వహణలో కానీ.. ఇతర ప్రదేశంలో కానీ చనిపోతే ఆ ఉద్యోగి మృతదేహాన్ని ఇంటికి తరలించటానికి చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. సంఘటనా స్థలం నుంచి ఇంటికి తీసుకువెళ్లడానికి నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈఅంశంలో మరిన్ని వివరాలు కావాలంటే 1985 సెప్టెంబర్‌ 15న జారీ చేసిన జీవో 1669 చూడవచ్చు. ✍ సస్పెన్షన్‌లో ఉంటే.. :: ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్‌లో ఉండగా మరణిస్తే.. సస్పెన్షన్‌ విధించిన నాటి నుంచి చనిపోయిన కాలం వరకూ మానవతాభావంతో ఆ ఉద్యోగి డ్యూటీలో ఉన్నట్టుగానే పరిగణిస్తారు. సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారంతో పాటు ఇతరత్రా రాయితీలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ఈ కాలంలో అలవెన్స్‌లు వంటివి వర్తించినా వాటిని కూడా కుటుంబసభ్యులకు చెల్లిస్తారు. ✍ కారుణ్య నియామకం - కరువుభత్యం :: ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగమిస్తారు. అయితే వారి అర్హతల ప్రాతిపదికన వివిధ స్థాయిల్లో తీసుకునే అవకాశం ఉంది. మరణించిన ఉద్యోగికి సంబంధించి డీయర్‌నెస్‌ అలవెన్స్‌ (డీఏ) ను కుటుంబ పెన్సన్‌ కింద చెల్లించరు. కానీ కారుణ్య నియామకం పొందిన వారికి ఈ మొత్తాన్ని రెగ్యులర్‌గా చెల్లిస్తారు. దీని వివరాలను 1998 మే 25న జారీ చేసి జీవో 89లో తెలుసుకోవచ్చు. ✍ సంఘ విద్రోహ శక్తుల చేతిలో మరణిస్తే... :: విధుల్లో ఉండగా అనుకోని సంఘటనల వల్ల మరణించినా. తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో దుర్మరణం పాలైతే తక్షణం ఆ ఉద్యోగి కుటంబసభ్యులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు. ✍ ఫ్యామిలీ పింఛన్‌ :: ఉద్యోగి మృతి చెందితే కుటుంబసభ్యులకు కుటుంబ పింఛన్‌ను వర్తింపజేస్తారు. ఈ పింఛన్‌ ఉద్యోగిస్థాయి, తరగతిని బట్టి ఉంటుంది. డీసీఆర్‌జీ పింఛన్‌రూల్స్‌కు అనుగుణంగా కుటుంబ పింఛన్‌ వర్తిస్తుంది. ✍ చెల్లింపులు, అడ్వాన్సులు రద్దు :: ఒక ఉద్యోగి సంస్థ నుంచి అప్పులు కానీ, అడ్వాన్సులు కానీ తీసుకుని మృతిచెంది ఉంటే ఆమొత్తాన్ని రద్దు చేస్తారు. ఉద్యోగి మరణించిన సమయానికి జీపీఎఫ్‌తో సమానమైన రూ.10 వేలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ✍ రిఫండ్‌ :: ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్‌ కింద మినహాయించిన మొత్తాన్ని ఆ ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. 1974 నవంబర్‌ 9న జారీ చేసిన జీవో 307తో పాటు 1983 ఏప్రిల్‌ 27నజారీ చేసిన జీవో 55 ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.
WOMAN PROTECTION

WOMAN PROTECTION

మహిళలరక్షణకోసంరూపొందించిన చట్టాలు
ఐపీసీసెక్షన్లగురించితెలుసుకోవాల్సినఅవసరం_ఎంతైనాఉంది. ఏ నేరానికి ఏ శిక్ష..


●సెక్షన్ 100 : ఆత్మరక్షణ కోసం ఎదుటి వారిపై దాడి చేస్తే తప్పు లేదు. ఆ సమయంలో సదరు వ్యక్తి చనిపోయినా మీకు శిక్ష పడదు.

●166(బీ) : ఈ సెక్షన్ ప్రకారం బాధితురాలికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఇవ్వకపోతే సిబ్బంది, యాజమాన్యం మీద కేసు వేయవచ్చు.

●228(ఏ) : అత్యాచారానికి గురైన మహిళ అనుమతి లేకుండా మీడియాలో ఆమె పేరు, ఫొటోలు ప్రచురించరాదు. అలా చేస్తే సదరు సంస్థపై చర్యలు తీసుకోవచ్చు.

●354 : స్త్రీ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, అవమానపర్చినా, అనుమతి లేకుండా ఫొటో, వీడియో తీసినా ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయవచ్చు.

●376 : 18 ఏళ్లలోపు ఉన్న యువతితో సెక్సులో పాల్గొంటే నేరం. ఒకవేళ ఆమె ఇష్ట ప్రకారమే చేసినా సదరు పురుషుడికి ఈ సెక్షన్ కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది.

●376 : వైద్యం కోసం వచ్చిన మహిళను లైంగికంగా వేధిస్తే ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. దీని ప్రకారం సదరు వ్యక్తి జైలుకు వెళ్లాల్సి వస్తుంది.

●494 : భార్య ఉండగా మరొకరిని పెళ్లి చేసుకుంటే ఈ సెక్షన్ ప్రకారం సదరు వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది.

●498(ఏ) : ఓ వివాహిత స్త్రీని ఆమె భర్తగానీ, భర్త బంధువులుగానీ శారీరకంగా, మానసికంగా హింసించినా, అందుకు ప్రేరేపించినా, ప్రోత్సహించినా ఈ సెక్షన్ కింద కేసు వేయవచ్చు. కనీసం మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కట్టాల్సి వస్తుంది.

●509 : మహిళలతో అవమానంగా మాట్లాడినా, సైగలు చేసినా ఈ చట్టం ప్రకారం శిక్షకు అర్హులు.

●294 : రోడ్డు మీద నడుస్తుంటే, బస్టాప్‌లో, ఇంకెక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు అసభ్యకరంగా పాటలు పాడుతూ ఎవరైనా ఇబ్బంది పెడితే ఈ సెక్షన్ ప్రకారం వారిపై కేసు నమోదు చేయవచ్చు. కనీసం మూడునెలలకు తగ్గకుండా వారికి జైలుశిక్ష పడుతుంది. లేదా జరిమానా కట్టాల్సి ఉంటుంది.

●354 (డీ) : ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా వెక్కిరించినా, అనుకరించినా, వారిపై ఈ సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. నిందితులకు 3 నుంచి 5 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశముంది. మీరు పనిచేసే ప్రదేశాల్లో మీ తోటి ఉద్యోగులుగానీ, మీ బాస్‌గానీ సెక్స్‌కోసం ఇబ్బంది పెడితే 2013 వేధింపుల చట్టం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు.

●499 : ఫొటోలు మార్పింగ్ చేసి ఇబ్బందికరంగా ఇంటర్నెట్‌లో పెడుతున్న ఘటనలు ఈ మధ్య బాగా వెలుగుచూస్తున్నాయి. ఇలాంటివి మీకు ఎదురైతే ఈ సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. నేరం రుజువైతే సదరు వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది.

●354(బీ) :మహిళను పై నున్న దుస్తులను బలవంతంగా తొలగిస్తే (compelling her to be naked) సంబంధిత ఆ వ్యక్తికి 3 నుంచి 7 ఏళ్ల దాకా శిక్షపడుతుంది. 13/2013 సవరణ చట్టం ద్వారా ఈ సెక్షన్ అదనంగా చేర్చారు.

●354(సీ) : మహిళ లేదా విద్యార్థిని అనుమతి లేకుండా ఫొటోలు/వీడియోలు తీసి వాటిని ఇతరులకు పంపించినా (voyeurism) సంబంధిత వ్యక్తికి ఏడాది నుంచి 3 ఏళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది. ఆ వ్యక్తి తిరిగి అదే నేరానికి పాల్పడితే 3 నుంచి 7 ఏళ్ల దాకా శిక్షతో పాటు జరిమానా విధిస్తారు.

●373 : 18 ఏళ్ల మైనర్ బాలికను కొనుగోలు చేస్తే పదేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తారు.

●316 : నిండు గర్భవతిని చంపితే సంబంధిత వ్యక్తిపై ప్రాణహరణం కింద (culpable homicide) నేరం మోపుతారు. ఆమె మరణించడానికి బదులుగా గర్భంలోని శిశువు (quick unbron child) మృతిచెందితే ఈ సెక్షన్ కింద 10 ఏళ్ల దాకా జైలుశిక్ష పడుతుంది.

●376(బీ): ఒకరికన్నా ఎక్కువ మంది మహిళపై లైంగికదాడి చేస్తే, ఒక్కొక్కరికీ 20 ఏళ్లు తగ్గకుండా జీవితఖైదు శిక్ష విధించబడుతుంది. 13/2013 సవరణ చట్టం ద్వారా ఈ సెక్షన్ సవరించారు.

●366(ఏ) : మైనర్ బాలికను వ్యభిచారానికి ప్రోత్సహించినా, ప్రలోభ పెట్టినా పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు.

●366 : స్త్రీలు, బాలికలను బలవంతంగా ఎత్తు కెళ్లి పెళ్లి చేసుకుంటే పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా పడుతుంది.

This Post Has 0 Comments

Leave a Reply

Back To Top
Translate »