skip to Main Content
ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం తెలుసుకోవాల్సిన కీలక విషయాలు...... ✍ అంత్యక్రియలకు సాయం ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల ఖర్చుకుగాను తక్షణం రూ.20 వేలు అందిస్తారు. G.O.Ms.No.122, GA(SW) Department, Dt: 11.04.2016 ఈ జీవోలో అన్ని వివరాలు పొందుపరిచారు. ✍ మరణించిన ఉద్యోగి :: మృతదేహాన్ని తరలించడానికి సంబంధించి రవాణా చార్జీలు సైతం ప్రభుత్వ చెల్లిస్తుంది. ఎక్కడైతే మరణిస్తారో అక్కడి నుంచి తరలించే ప్రాంతాన్ని బట్టి ఈ చార్జీలు చెల్లిస్తారు. దీనికి సంబంధించి 1987 జూన్‌ 23న జీవో 153 జారీచేశారు. ✍ ఎన్‌క్యాష్‌మెంట్‌ :: మృతిచెందిన ఉద్యోగి ఎర్న్‌డ్‌ లీవ్‌లకు సంబంధించిన ఎన్‌క్యాష్‌మెంట్‌ను కుటుంబసభ్యులకు చెల్లిస్తారు. ఈ ఎన్‌క్యాష్‌మెంట్‌ను 240 రోజుల నుంచి 300 రోజులకు పెంపుదల చేశారు. దీనికి సంబంధించి 2005 సెప్టెంబర్‌ 16న జీవో 232 జారీచేశారు. ✍ యాక్సిడెంటల్‌ ఎక్స్‌గ్రేషియా :: విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు ప్రమాదాల్లో మృత్యువాత పడితే ప్రభుత్వం రూ.లక్ష ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తుంది. దీనికి సంబంధించి 2006 జూలై 7న 317 జీవో జారీచేశారు. ✍ రవాణా చార్జీలు :: ఉద్యోగి విధి నిర్వహణలో కానీ.. ఇతర ప్రదేశంలో కానీ చనిపోతే ఆ ఉద్యోగి మృతదేహాన్ని ఇంటికి తరలించటానికి చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. సంఘటనా స్థలం నుంచి ఇంటికి తీసుకువెళ్లడానికి నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈఅంశంలో మరిన్ని వివరాలు కావాలంటే 1985 సెప్టెంబర్‌ 15న జారీ చేసిన జీవో 1669 చూడవచ్చు. ✍ సస్పెన్షన్‌లో ఉంటే.. :: ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్‌లో ఉండగా మరణిస్తే.. సస్పెన్షన్‌ విధించిన నాటి నుంచి చనిపోయిన కాలం వరకూ మానవతాభావంతో ఆ ఉద్యోగి డ్యూటీలో ఉన్నట్టుగానే పరిగణిస్తారు. సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారంతో పాటు ఇతరత్రా రాయితీలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ఈ కాలంలో అలవెన్స్‌లు వంటివి వర్తించినా వాటిని కూడా కుటుంబసభ్యులకు చెల్లిస్తారు. ✍ కారుణ్య నియామకం - కరువుభత్యం :: ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగమిస్తారు. అయితే వారి అర్హతల ప్రాతిపదికన వివిధ స్థాయిల్లో తీసుకునే అవకాశం ఉంది. మరణించిన ఉద్యోగికి సంబంధించి డీయర్‌నెస్‌ అలవెన్స్‌ (డీఏ) ను కుటుంబ పెన్సన్‌ కింద చెల్లించరు. కానీ కారుణ్య నియామకం పొందిన వారికి ఈ మొత్తాన్ని రెగ్యులర్‌గా చెల్లిస్తారు. దీని వివరాలను 1998 మే 25న జారీ చేసి జీవో 89లో తెలుసుకోవచ్చు. ✍ సంఘ విద్రోహ శక్తుల చేతిలో మరణిస్తే... :: విధుల్లో ఉండగా అనుకోని సంఘటనల వల్ల మరణించినా. తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో దుర్మరణం పాలైతే తక్షణం ఆ ఉద్యోగి కుటంబసభ్యులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు. ✍ ఫ్యామిలీ పింఛన్‌ :: ఉద్యోగి మృతి చెందితే కుటుంబసభ్యులకు కుటుంబ పింఛన్‌ను వర్తింపజేస్తారు. ఈ పింఛన్‌ ఉద్యోగిస్థాయి, తరగతిని బట్టి ఉంటుంది. డీసీఆర్‌జీ పింఛన్‌రూల్స్‌కు అనుగుణంగా కుటుంబ పింఛన్‌ వర్తిస్తుంది. ✍ చెల్లింపులు, అడ్వాన్సులు రద్దు :: ఒక ఉద్యోగి సంస్థ నుంచి అప్పులు కానీ, అడ్వాన్సులు కానీ తీసుకుని మృతిచెంది ఉంటే ఆమొత్తాన్ని రద్దు చేస్తారు. ఉద్యోగి మరణించిన సమయానికి జీపీఎఫ్‌తో సమానమైన రూ.10 వేలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ✍ రిఫండ్‌ :: ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్‌ కింద మినహాయించిన మొత్తాన్ని ఆ ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. 1974 నవంబర్‌ 9న జారీ చేసిన జీవో 307తో పాటు 1983 ఏప్రిల్‌ 27నజారీ చేసిన జీవో 55 ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.
p3

FAQ'S

 • Question :How to prepare Hiring of Private Vehicle bills ? As per Agreement amount Rs. 33,000/-. The owner of the vehicle does not have GST Number. Totol Gross Rs. 33,000 SGT @ 5% Rs. 1650 ---------------------------------- Rs. 31,350 I.T., 2 % Rs. 627 --------------------------------- Net Amount Rs. 30,723 Whether it is correct ? Please inform. But, in the IFMIS Portal not possible to do like this ? How to do ? Please inform any latest Rule Position. Thanking you.
  Answer : Dear Sir, The gross amount may be restricted to Rs.31,350/- and IT for Rs.627 should be recovered. With regards
 • Question :I prepared RPS-2020 bill of Dy.EE., in our office. But, the bill was not approved in the APAO office so for and the Dy.EE., was transferred. Shall we issue LPC ? If it issue, whether we get old Basic Pay - RPS-2015 (or) New Basic pay RPS-2020 ? Please inform.
  Answer : Dear sir Since the bill has not been admitted as per New RPS, the LPC in IFMIS shows with old PRC only.
 • Question :వర్క్స్ బిల్లులో ఎంతవరకు EE and SE check measure ఉండాలి వాటికి సంబంది సర్కులర్ ఇవ్వగలరు
  Answer : CHECK MEASUREMENT అన్ని ఇంజినీరింగ్ విభాగాల సూపరింటెండింగ్ ఇంజనీర్లందరూ స్థిరంగా అన్నింటినీ తనిఖీ చేయాలి 1/3వ, 2/3వ దశ పనిలో రూ.50.00 లక్షలు మరియు అంతకంటే ఎక్కువ ఖర్చు చేసే పనులు మరియు తుది కొలతలకు ముందు, అతని చెక్కు కొలతలు ప్రతిసారీ అయ్యే మొత్తం వ్యయంలో 30% కంటే తక్కువ కాదు. అదేవిధంగా, అన్ని ఇంజినీరింగ్ డిపాఫ్ట్‌మెంట్‌ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌లు రూ.5 లక్షలు & అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే పనులన్నింటిని, ప్రతిసారీ వెచ్చించే మొత్తం వ్యయంలో 30% కంటే తక్కువ కాకుండా అన్ని ప్రధాన వస్తువులను కవర్ చేసే చెక్-మెజర్‌మెంట్‌ను స్థిరంగా తనిఖీ చేయాలి. (G.O.Ms.No.84 Dated:06-06-2000) మరిన్ని వివరాల కోసం https://worksaccounts.com/works/ ని సందర్శించండి
 • Question :Our department office rent is fixed@8.50/- we have taken rented accommodation in BSNL office building.for concluding rental agreement, BSNL authority have raised a query of whether rent is inclusive of GST or exclusive.pl clarify
  Answer : Dear Sir, GST in respect of Immovable Property: 1. GST on rent is taxed @ 18% of the rent paid. This GST would be CGST @ 9% and SGST @ 9% in case the landlord is registered in the same state. In case the landlord is registered in a different State, IGST @18% would be levied. 2. The landlord will be exempt from taking registration under GST if the aggregate turnover of supply of goods or services or both during the year is less than Rs.20 lakhs during the financial year. 3. GST on Renting of Immovable property will be classified as supply of service under Schedule-II. In view of the above the plinth area wise sq.ft rate is being calculated and then GST @18% will be added. But TDS will be made only if rent value is crossing 2.5 lakhs per annum. Also income tax will be deducted if annual rental value crossing 2.40 lakhs per annum @ 2%. Since office is commercial purpose, so GST is to be charged.
 • Question :Sir, can you pls explain what are the functions of a DAO(w)?
  Answer : A Divisional Accounts Officer(w) has three fold functions viz., as an accountant i.e., as the compiler of the accounts of the Division, he is responsible for the compilation of accounts from the data furnished to him; As an internal checker, he is responsible for applying certain preliminary checks to the initial accounts, vouchers etc., and as a Financial Assistant i.e., as the General Assistant and adviser to the Divisional Officer, the DAO is to render assistance and guidance in all mattters relating to the accounts , budget estimates or to the operation of financial rules generally. ( See Para 89 of AP.W.A. Code.
 • Question :ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ మరియు అదనపు విద్యా అర్హతలకి ఇంక్రిమెంట్లు ఎప్పటి నుంచి నిలుపుదల చేశారు?
  Answer : వీటిని 98 వేతన స్కేల్స్ లో నిలుపుదల చేశారు.ఈ నిలుపుదల 1.7.98 నుండి అమలు చేశారు.1.7.98 ముందు వారికి ఈ ఇంక్రిమెంట్లు వర్తిస్తాయి.
 • Question :నేను ఒక cps ఉద్యోగిని. ఏ సందర్భంలో50వేల రూపాయలు టాక్స్ ఎక్జంప్సన్ క్లైమ్ చేసుకోవచ్చు.?
  Answer : మీ సేవింగ్స్ 80CC ప్రకారం 1.5 లక్షలు దాటి వున్నపుడు మాత్రమే అదనంగా 50వేల రూపాయల టాక్స్ ఎక్జంప్సన్ వర్తిస్తుంది(eఫైలింగ్ చేస్తే)లేదంటే వర్తించదు.
 • Question :నాకు ఉద్యోగం రాకముందు పాప ఉంది. ఉద్యోగం లో చేరిన తరువాత ఒకసారి ప్రసూతి సెలవు వాడుకున్నాను.మరొక పర్యాయం ప్రసూతి సెలవు వాడుకోవచ్చునా?
  Answer : ఇద్దరు జీవించి ఉన్న పెద్ద పిల్లలు వరకు మాత్రమే ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుంది.బిడ్డ పుట్టినది ఉద్యోగం రాక పూర్వమా?వచ్చిన తరువాతా?అనే దానితో నిమిత్తం లేదు.కావున మూడవ బిడ్డకి ప్రసూతి సెలవు కి మీకు అవకాశం లేదు.
 • Question :ఉద్యోగి మరణించిన సందర్భంలో CPS డబ్బులు ఎలా తీసుకోవాలి?
  Answer : 103-జీడీ ఫారం లో సంబంధిత పత్రాలు జాతపరచాలి. చివరి నెల చందా చెల్లించిన ddo ద్వారా ట్రెజరీ అధికారులు ద్వారా పి ఆర్ ఏ ముంబై కి పంపుకుంటే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయి.
 • Question :కారుణ్య నియామక పథకం క్రింద ఉద్యోగం పొందిన ఆమెకు భర్త తరఫున కుటుంబ పెన్షన్ వస్తుందా? డి.ఏ రెండిటిపైనా చెల్లిస్తారా?
  Answer : కుటుంబ పెన్షన్ వస్తుంది. కాని G.O.Ms.No.125 F&P తేది:01.09.2000 ప్రకారం రెండిటిపైన కరువుభత్యాలు రావు. అయితే రెండింటిలో ఏది లాభకరమో అది ఎంచుకునే అవకాశం సదరు ఉద్యోగికి ఉన్నది.
 • Question :సాధారణంగా వార్షిక ఇంక్రిమెంట్ ను మంజూరు చేయకుండా నిలుపుదల చెయ్యవచ్చునా ?
  Answer : FR-24 లో &Increment should be drawn as a matter of course,unless it is withheld & అని ఉంది. క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారి నుండి ఇంక్రిమెంటు నిలుపుదల చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు ఉంటే తప్ప వార్షిక ఇంక్రిమెంటు యథావిధిగా మంజూరు చేయాల్సిందే.
 • Question :ప్రసూతి సెలవులో ఉన్నవారికి జీతం విధుల్లో చేరిన తరువాత ఇస్తారా? ప్రతినెలా ఇవ్వవచ్చునా ?
  Answer : A.P.Fundamental Rule 74(a) క్రింద గల సబ్ రూల్ 32 ప్రకారంగా & Leave Salary payable in India after the end of each calender month & కాబట్టి నెలనెలా జీతం చెల్లించవచ్చు.
 • Question :ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా ?
  Answer : G.O.Ms.No.802 తేది:21.4.1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి.
 • Question :CPS ఉద్యోగులకు 50 వేల అదనపు పన్నురాయితీ కి అవకాశం ఉందా?
  Answer : అవకాశం ఉంది. అయితే దీనిని మ్యానువల్ రిటర్న్ లలో అనుమతించనప్పటికి ప్రస్తుతం e ఫైలింగ్ లో అనుమతించబడుతున్నది.
 • Question :నేను త్వరలో రిటైర్మెంట్ కాబోతున్నాను. పెన్షన్ బెనిఫిట్ లు ఐటీ లో చూపాలా?
  Answer : పెన్షన్ ను ఆదాయంగా చూపాలి. గ్రాట్యుటీ, కమ్యుటేషన్, సంపాదిత సెలవు నగదుగా మార్చుకోనుట ఆదాయం పరిధిలోకి రావు.
 • Question :మొదటి బిడ్డ పుట్టినప్పుడు పితృత్వ సెలవు వాడుకోలేదు. రెండవ బిడ్డ పుట్టినప్పుడు వాడుకున్నాను. ప్రస్తుతం మూడవ బిడ్డ పుట్టినది. ఇపుడు సెలవు వాడుకోవచ్చా?
  Answer : అవకాశం లేదు. జీఓ.231 తేదీ:16.9.2005 ప్రకారం పితృత్వ సెలవు ఇద్దరు జీవించియున్న పెద్ద పిల్లలకి మాత్రమే వర్తిస్తుంది.
 • Question :నేను 24 ఇయర్స్ స్కేల్ పొందిన పిదప పదోన్నhతి పొందాను. నా వేతనం FR--22బి ప్రకారం నిర్ణయించబడే అవకాశం ఉందా?
  Answer : లేదు. మీకు FR--22ఎ(i) ప్రకారం మాత్రమే వేతన నిర్ణయం జరుగుతుంది.
 • Question :Declaration of Probation చేయడానికి Date of Joining Consider చేస్తారా సార్, లేదా Appointment Order Date ని Consider చేస్తారా సార్ ? ఏదైనా జీవో ఉన్నదా? చెప్పగలరు.
  Answer : Date of Joining ని పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ మీకన్నా మెరిట్ లిస్ట్ లో ముందున్న వారు కనుక మీ కన్నా ఆలస్యంగా చేరితే, వారు చేరిన తేదీని పరిగణనలోకి తీసుకుంటారు. AP State and Subordinate Service Rules, 1996 చూడండి.
 • Question :చిన్న Clarification Medical leave 240 Days Entire Service లో ఉపయోగించుకోవాలి. అంటే Commutation చేస్తే 480 యేనా? దయచేసి Clarity ఇవ్వండి.
  Answer : అవును సర్. మీరు అడిగింది కరెక్ట్. Commutation 120 రోజులకు చేసుకుంటే 240 రోజుల శెలవుగా పరిగణించబడే పూర్తి జీతం వస్తుంది. ఇంక ఏ మాత్రం మెడికల్ లీవ్ అర్హత ఉండదు. మొత్తం సర్వీస్ లో 240 కముటెడ్ లీవ్ వాడుకోవచ్చు. 480 హాఫ్ పే లీవ్స్ డెబిట్ అవుతాయి.
 • Question :very will ee cheack memurment 30% or 100%
  Answer : Dear Sir, We think you mean "EE's check measurement required for every bill should be either 30% or 100%" As per Govt. orders the Check measurement of EE should cover 30% of total value of work done of each bill. For supporting government circulars and GOs pls. visit https://worksaccounts.com/works,on_front=0,on_front=0
 • Question :Previous Financial year Proceedings for other establishment bills are allowed or not. Plz clarify
  Answer : The validity of any proceedings is one year (calendar year) from the date of issuing proceedings.
 • Question :Is passing of telugu exam by an state Govt. employee is mandatory for getting promotion?
  Answer : Under Rule 14(a) of the State and Subordinate Service Rules 1996, an employee is exempted from passing the Second Class Language Test in Telugu prescribed Rule 14(a) & (b) of above rules, if they pass SSC Examination with Telugu as medium of instruction with Telugu as one of the subject.
 • Question :Can an employee give representation addressed to the Govt. directly without the knowledge of his immediate superior officer?
  Answer : As per para 86 of PWD Code, no officer should correspond direct with an authority superior to the officer under whom he is immediately serving, or which the state Government or to the Govt. of India, out of the regular course, except in case of extreme emergency, in which case he must send copies of his communication to his immediate superior together with a statement of his reasons for the direct correspondence.
 • Question :How many times can an employee reject his promotion.
  Answer : An employee cannot reject / skip promotion not even once in writing. But as per Govt.cir.Memo.No.10445/ ser-D/2011,GAD Dt:1-6-2011, an employee can skip his promotion once either by taking or not taking promotion orders and not joining the promotion post. However his name will be included in next years promotion panel list. After that he will not be allowed. Refer G.O.Ms.No.145 GAD,Dt:15-6-2004.
vishweshwarayya
1576916023_E.Madhu2

Madhuu Suudaan.E
               M.Sc.,M.C.A.,M.I.E., LL.B.

GURU
Rtd.Engineer

name
desgination

name
desgination

GURU
Rtd.Engineer

GURU
Rtd.

Back To Top
Translate »