skip to Main Content
Due to Virus attack on Microsoft server, the site is under restoration. Inconvenience is regretted.
SOCIAL MEDIA

SOCIAL MEDIA

సోషల్ మీడియాలో శృతిమించి ప్రవర్తిస్తే ఈ సెక్షన్లు అమలు చేయవచ్చు….

★ ఐటీ ఆక్ట్ 2000ఐటీ ఆక్ట్ సెక్షన్ 66ఐపీసీ సెక్షన్ 292సెక్షన్ 354A 354D (నిర్భయ చట్టం) సెక్షన్ 499సెక్షన్ 66D ట్రోల్ చేసే వారి కోసం.. సోషల్ మీడియా లో శ్రుతి మించి ప్రవర్తిస్తే

1. ట్రోలింగ్ (ఆడవారి మీద అసహ్యకర, అసభ్య, జోకులు వేయడం.వారి పేర్లు pics కి పెట్టడం).

2. డిఫమేషన్ (ఆడపిల్లలు లేదా పెళ్లి అయిన వారి ని కామెంట్ చేస్తూ పోస్ట్ పెట్టడం.. వారి కుటుంబ ప్రతిష్ట ను దెబ్బ తీసేలా కామెంట్స్ చేయడం.. పరువు నష్టం కలిగించడం).

3. స్టాకింగ్ (ఆడవారిపై అభ్యంతరకర కామెంట్స్ చేయడం, పోస్ట్లు పెట్టడం.)

★ ఈ పై 3 పనులకు పాల్పడిన వారు.. వారి స్నేహితులైనా.. సన్నిహితులైన.. బంధువులైనా… ఐటీ ఆక్ట్ 2000 ప్రకారం నేరస్థులు గా పరిగణింపబడుతారు.

★ ఐటీ ఆక్ట్ సెక్షన్ 66 ప్రకారం పనిష్మెంట్ ఫర్ వయోలాషన్ ఆఫ్ ప్రైవసీ కింద.. నిర్భయ చట్టం లోని సెక్షన్ 354A, 354D ప్రకారంహారాస్మెంట్ వయా ఎలెక్ట్రానిక్ కమ్యూనికేషన్ ప్రకారం నేరం…

★ సోషల్ మీడియాలో అసభ్యకర ఫొటో షేర్ చేస్తే..?

1. ఐపీసీ సెక్షన్ 292 కింద శిక్షార్హులవుతారు. ఈ సెక్షన్ ప్రకారం అసభ్యకరమైన అంశాన్ని వీడియో, ఫొటో, టెక్ట్స్ ఏదైనా సరే షేర్ చేస్తే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అదే ఇలాంటి పని మళ్లీ చేస్తే అప్పుడు ఏకంగా 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.

2. ఏదైనా మతాన్ని, వర్గాన్ని కించపరుస్తూ కామెంట్, పోస్ట్ పెడితే..? ఇలాంటి విషయాల్లో ఐటీ చట్టం కింద కేసు పెడతారు. దానితో పాటుగా మతానికి సంబంధించిన అంశం గనక అయితే 295 సెక్షన్ పెడతారు. ఒక వేళ ఇలాంటి విషయాల్లో అవతలి వారి పరువుకు భంగం కలిగితే సెక్షన్ 499 కింద కూడా కేసు పెడతారు.

3. అనుమతి లేకుండా వేరే వ్యక్తి ఫొటో వాడితే..? అవతలి వ్యక్తి అనుమతి లేకుండా ఎవరైనా అతని/ఆమె ఫొటోను వాడుకుంటే ఐటీ చట్టం సెక్షన్ 499 కింద కేసు పెడతారు. ఫొటోను వాడారు కనుక చీటింగ్ కేసు పెడతారు. అలాగే మార్ఫింగ్ చేస్తే అదనపు కేసులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది.

4. నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే..? ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో నకిలీ ప్రొఫైల్స్ ఎక్కువగా క్రియేట్ చేస్తుంటారు. అయితే ఇలా చేస్తే సెక్షన్ 499 కింద కేసు పెడతారు. అలాగే ఐటీ చట్టం సెక్షన్ 66డి కింద కూడా కేసు పెడతారు. చాలా మంది తాము ఏమేం చేస్తున్నా అది ఎవరికీ తెలియదు అని అనుకుంటున్నారు. అయితే అది తప్పు. ఎందుకంటే ఇంటర్నెట్‌లో ఎవరు ఏం చేసినా అది రికార్డెడ్‌గా ఉంటుంది. ఎవరైనా ఏ తప్పు చేసినా దాన్ని బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు, సైబర్ నిపుణులు తేలిగ్గా ట్రాక్ చేయగలుగుతారు.

★ ఫోన్ లేదా కంప్యూటర్ ఏది వాడినా అందులో ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే దానికి ఉండే ఐపీ అడ్రస్‌ను వారు ట్రాక్ చేస్తారు.

★ సోషల్ మీడియాలో మనం పెట్టె పోస్టులు వేరేవర్ని భాదించనివి అయితే మీకు ప్రాబ్లం ఉండదు.

దయచేసి పోస్ట్స్ కామెంట్స్ పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్త తీసుకోండి.

★ లైట్ గా తీసుకుంటున్నారులే అని అనుకోoడి, భాదితులు కంప్లైంట్ ఇస్తే ఉన్న జాబ్స్ పోయి బెయిల్ కూడా రాని విధంగా ఉంటుంది.

★ మీరు పోస్ట్ డిలీట్ చేసినా సరే అంతకుముందు అతను / ఆమెతో జరిగిన ఒక సంభాషణ చాలు కేసు బుక్ చెయ్యడానికి.

జాగ్రత్తగా గమనించగలరు

This Post Has 0 Comments

Leave a Reply

Back To Top